![]() |
![]() |
.webp)
ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో బిగ్ బాస్ రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. గతవారం శుభశ్రీ ఎలిమినేషన్ అవ్వగా, గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ లో ఉంచాడు బిగ్ బాస్. అయితే సోమవారం అంటేనే హీటెడ్ నామినేషన్ల ఆర్గుమెంట్ సాగుతుంది. హౌజ్ లోకి కొత్తగా 5 మంది కంటెస్టెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చీ రాగానే పాత హౌజ్ మేట్స్, కొత్త హౌజ్ మేట్స్ కి మధ్య గట్టి ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్.
పాత కంటెస్టెంట్స్ కి ఆటగాళ్ళు, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ కి పోటుగాళ్ళు అని చెప్పాడు బాగ్ బాస్. ఇక ఇంటిలో నుండి బయటకు పంపడానికి ఎవరు అన్ డిజర్వింగ్ అని భావిస్తున్నారో వారిని నామినేట్ చేసి, తగిన కారణాలు చెప్పండని కొత్త కంటెస్టెంట్స్(పోటుగాళ్ళు)తో బిగ్ బాస్ కోరాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా వచ్చినవాళ్ళంతా మన సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్ లని నామినేట్ చేశాడు.
ఆ రోజు బెల్ట్ టాస్క్ లో.. లాగొద్దు లాగొద్దని అందరూ నిన్ను అంటుంటే ఎంకరేజ్ మెంట్ అని అనుకున్నావంటు, అది నాకు నచ్చలేదని టేస్టీ తేజని పూజామూర్తి నామినేట్ చేసింది. ఆ రోజు బెల్ట్ టాస్క్ లో సంఛాలక్ గా నువ్వే ఉన్నావ్. టేస్టీ తేజ అలా చేస్తున్నప్పుడు నువ్వు ఆపకుండా అలానే చూస్తున్నావ్. అది నాకు నచ్చలేదని ఆట సందీప్ ని భోలే శావలి నామినేట్ చేశాడు. అదేవిధంగా అమర్ దీప్, శోభా శెట్టిలని అశ్విని శ్రీ నామినేట్ చేసింది. నయని పావనిని టేస్టీ తేజ నామినేట్ చేశాడు. ఇక శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు ఇద్దరు కలిసి అశ్విని శ్రీని నామినేట్ చేశారు. దాంతో తను ఏడ్చేసింది. అమర్ దీప్ ని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు.
కారణం చెప్తూ.. ఇలాగే పొడిచేస్తే చించేస్తా అని ప్రతీవారం చెప్తున్నావ్ కానీ ఇదే రిపీట్ చేస్తున్నావ్. ప్రతివారం నీ ఆటలో ఏదైనా మార్పు వస్తుందేమో అని చూస్తునే ఉన్నాం కానీ నువ్వు ఒక మెట్టు ఎక్కకపోగా కిందకి పడిపోతున్నాం. మాట్లాడేదానికి సంబంధం లేకుండా ఆడుతున్నావ్, ఫాల్స్ గేమ్ ఆడుతున్నావ్. తప్పుల మీద తప్పులు చేస్తున్నావ్. నీ ఆట ఇంప్రూవ్ చేసుకోవాలనే నేను అనుకుంటున్నానని అమర్ దీప్ తో అంబటి అర్జున్ అన్నాడు. ఇలా కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మొదలైంది.
పూజామూర్తి, అమర్ దీప్ లని శివాజీ నామినేట్ చేశాడు. అమర్ దీప్ అని శివాజీ అనడంతోనే అందరు నవ్వేశారు. వాడికెందుకో నేనంటే ఒక ఫీలింగ్ అని, వాడు ఇంప్రూవ్ అవ్వాలని, నేను వాడికేసే నామినేషన్ ఇదే లాస్ట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాంటూ అమర్ దీప్ ని శివాజీ నామినేట్ చేశాడు. ఇక కాస్త లావుగా ఉన్నావ్. గేమ్స్ బాగా ఆడతావో? ఆడవో అన్న చిన్న డౌట్ ఉంది. బాగా ఆడతావని ఆశిస్తున్నానంటూ పూజామూర్తిని నామినేట్ చేశాడు శివాజీ. అమర్ దీప్, నయని పావనిని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత అమర్ దీప్, అశ్విని శ్రీలని శోభాశెట్టి నామినేట్ చేసింది. యావర్, అశ్విని శ్రీలని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది.
![]() |
![]() |